తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఏపీ మంత్రి ప్రశంసల జల్లు కురిపించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో చాలా సార్లు.. తాను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానంటూ రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి పయ్యావుల కేశవ్.