తెలంగాణలో క్రీడాకారులను మరింత ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించడంపై చర్చించారు. ఇప్పటివరకు ఉన్న మైదానాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ వర్సిటీ డిజైన్లను పరిశీలించారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చేలా నిర్మాణాలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశాలు ఇచ్చారు.