వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం కోసం తెలంగాణ, బిహార్ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. తెలంగాణలో విజయవంతమైన ఆయిల్‌పామ్ సాగు విధానాన్ని అధ్యయనం చేయడానికి బిహార్ ఆసక్తి చూపగా.. బిహార్‌లో ప్రసిద్ధి చెందిన మఖానా సాగు, ప్రాసెసింగ్ విధానాలపై తెలంగాణ ఆసక్తి వ్యక్తం చేసింది. సెక్రటేరియట్‌లో బుధవారం తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బిహార్ మంత్రి విజయ్‌కుమార్ సిన్హా భేటీ అయి.. ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, పంటల వైవిధ్యీకరణపై చర్చించారు.