దసరా పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. నేటి నుంచి (అక్టోబర్ 21) విశాఖపట్నం–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు, మైసూరు–వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ మధ్య మరో ప్రత్యేక రైలు సర్వీసులు అందించనున్నాయి. ఈ రైళ్లు పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగనున్నాయి. దీపావళి ప్రయాణాల కోసం కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించడంతో ముందస్తు టికెట్ రిజర్వేషన్లకు ప్రాధాన్యం పెరిగింది.