ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగు మూలాలు ఉన్న ఎన్ఆర్ఐ రాజ్ మంతెన కుమార్తె వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా జరిగింది. ఉదయ్‌పుర్‌లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వచ్చిన వీవీఐపీల లిస్ట్ కారణంగా.. ఈ పెళ్లి, అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, జస్టిస్ బీబర్, జెన్నిఫర్ లోపేజ్ వంటి గ్లోబల్ స్టార్లతో పాటుగా హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరు కావటంతో నేత్ర మంతెన, వంశీ గాదిరాజు వివాహం హాట్ టాపిక్‌గా మారింది.