ఇటీవల వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన వారి ఖాతాల్లో ఎకరాకు రూ. 10,000 చొప్పున త్వరలోనే జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వరదల కారణంగా రాష్ట్రంలో రు.10 వేల కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకుంటామని చెప్పారు.