చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం ఉద్దేశించిన పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నట్టు ఏపీ మంత్రి తెలిపారు. ఈ పథకం కింద పాతిక వేలు ఆర్థిక సాయం అందుతుంది. ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, హస్తకళా వస్తువులను కూడా విదేశాలకు విస్తరించేందుకు ప్రణాళికను రచించారు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో లేపాక్షి షోరూమ్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు.