హనుమకొండ జిల్లా ముల్కనూర్ రైతుల సహకార సంఘం తమ బ్రాండెడ్ తెలంగాణ సోనా, జై శ్రీరామ్ బియ్యాన్ని అమెరికాకు ఎగుమతి చేసేందుకు రెడీ అవుతోంది. అమెరికాకు చెందిన హార్వెస్ట్‌లింక్ సహకార సంస్థతో భాగస్వామ్యమై తొలి విడతలో 25 టన్నుల బియ్యాన్ని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 1956లో 373 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంఘంలో ప్రస్తుతం 7500 మందికి పైగా సభ్యులున్నారు. విత్తనాలు, రుణాలు, పంట కొనుగోలు, నిల్వ, బోనస్ వంటి సేవలతో రైతులకు అండగా నిలుస్తోంది. ఎగుమతులకు అనుమతులు లభిస్తే నెల రోజుల్లో తొలి సరుకు పంపించే అవకాశం ఉంది. విదేశీ మార్కెట్లో 10–15 శాతం అధిక ధర లభిస్తుందని అంచనా వేస్తున్నారు.