క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలు.. ఆ హోదాను కోల్పోతారంటూ సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు బాధాకరమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తొందరపాటు నిర్ణయమన్న షర్మిల.. దీంతో ఏపీలో 80 లక్షలమంది నష్టపోతారని అన్నారు. కేంద్రం వెంటనే సుప్రీంకోర్టు తీరుపై రీ అప్పీలుకు వెళ్లాలని సూచించారు.