సద్దుల బతుకమ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. స్వగ్రామాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా.. ఆయా బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. స్పెషల్ బస్సుల్లో 25 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు.