దానం నాగేందర్ అనర్హత వ్యవహారం నేపథ్యంలో ఎంపీ రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్‌కు ఉపఎన్నికలు కలిసి రావని.. గత అనుభవాలను పరిశీలిస్తే మరోసారి ఓటమి ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన రాజకీయ అంచనా వేశారు. ఖైరతాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. దానం నాగేందర్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.