సనత్‌నగర్‌ టిమ్స్‌ హాస్పిటల్‌లో భారీ చోరీ.. లక్షల విలువైన వైద్య పరికరాలు అపహరణ

1 hour ago 1
హైదరాబాద్ సనత్‌నగర్‌ టిమ్స్ ఆసుపత్రి అకడమిక్‌ బ్లాక్‌లో భారీ చోరీ జరిగింది. ఐదో అంతస్తులోని స్టోరేజ్‌ రూమ్‌ తాళాలు పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు 12 ఐవోఎస్‌ బాక్సులను ఎత్తుకెళ్లారు. ఒక్కో బాక్సులో 24 పరికరాలు ఉండటంతో మొత్తం 288 వైద్య పరికరాలు చోరీకి గురయ్యాయి. ఈ నెల 13న ఉదయం ఘటన జరిగినట్లు గుర్తించారు. సైట్‌ ఇంజనీర్‌ ఫిర్యాదుతో బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఆసుపత్రి ఇటీవలే ప్రారంభం కాగా.. కార్డియాక్‌, రీనల్‌, ఆర్గన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌, ట్రామా, ఐసీయూ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.
Read Entire Article