సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఖమ్మం–హైదరాబాద్ 365బీ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వోల్వో కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యారు. మృతుడిని ఖమ్మం మమత ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్‌గా గుర్తించారు. నంబర్ ప్లేట్ కాలిపోవడంతో వాహన వివరాల గుర్తింపులో ఇబ్బందులు ఎదురయ్యాయి. టోల్ ప్లాజాల సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.