ఖరీఫ్ సీజన్‌లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కొత్త వ్యూహంతో సిద్ధమవుతోంది. అక్టోబరు మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభించేలా ఎస్‌హెచ్‌టీ విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. సాధారణ గోదాములతో పాటు మూతపడిన రైస్ మిల్లులు, ఇండస్ట్రియల్ షెడ్లు, మార్కెట్ యార్డులు, ఫంక్షన్ హాళ్లను కూడా నిల్వకు వినియోగించనున్నారు. ప్రతి ధాన్యం రవాణా వాహనానికీ జీపీఎస్ తప్పనిసరి చేయడంతో పాటు, మొబైల్ యాప్‌తో మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు.