దామగుండ ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్టేషన్ ఏర్పాటుతో అక్కడ 12 లక్షల మెుక్కలను నరికివేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రజా సంఘాలు, పర్యావరణ ప్రేమికుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో చెట్ల నరికివేతపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి కీలక ప్రకటన జారీ చేశారు.