దీపావళికి ఫ్రీగా వెండి నాణేల పంపిణీ.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ సంప్రదాయం తెలుసా?

2 days ago 5
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో దీపావళి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధనత్రయోదశితో మొదలైన ఉత్సవాలు ఆరు రోజుల పాటు జరగనున్నాయి. ఈనెల 8 నుంచి భక్తులకు ఉచితంగా వెండి నాణేలను అందజేయనున్నారు. ఏడాదంతా అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలను కరిగించి.. అమ్మవారి రూపంలో ప్రత్యేక నాణేలను తయారు చేయించడం సంప్రదాయం. మహాహారతి, ప్రత్యేక పూజల అనంతరం వీటిని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈ నాణేలను ఇంట్లో ఉంచుకుంటే సంపద, శుభం కలుగుతాయని భక్తుల విశ్వాసం. భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Entire Article