విజయవాడ దుర్గ గుడి ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఎండల తీవ్రత, వడగాలుల నేపథ్యంలో ఈ పనులకు విరామం ఇచ్చారు. ఈ సమయంలో పనులు చేపడితే టెక్నికల్ సమస్యలు వస్తాయని.. రోడ్లు వేసినా త్వరగా పగుళ్లు వచ్చే అవకాశం ఉందని రోడ్లు భవనాల శాఖ అధికారులు దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీంతో పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.