సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం సందర్భంగా ఒవైసీ బ్రదర్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశభక్తి విషయంలో మోదీ, అమిత్ షాలకు ఓవైసీ బ్రదర్స్ ఏమీ తక్కువ కాదని పేర్కొన్నారు. పాతబస్తీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇప్పటివరకు ఏ సీఎం పాతబస్తీకి వచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. పాతబస్తీ అభివృద్ధితి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.