తన వివాదంపై హైకమాండ్‌కు రాసిన లేఖను కొండా సురేఖ విడుదల చేశారు. మంత్రి పదవిలో తన అధికారాలను క్రమంగా తగ్గించారని, తన శాఖలకు సంబంధించిన నిర్ణయాలను తనకు తెలియకుండానే తీసుకున్నారని ఆరోపించారు. యాదాద్రి బోర్డు వ్యవహారంలో తనను పక్కనపెట్టారని.. సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి నిధులను తనకు సమాచారం లేకుండా రోడ్లు, భవనాల శాఖకు బదిలీ చేశారని పేర్కొన్నారు. తన ఫొటోను ప్రభుత్వ ప్రకటనల్లో తొలగించారని, ఓఎస్డీ సుమంత్‌పై తనకు తెలియకుండా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.