'మంత్రి పదవి పోయినందుకు బాధ లేదు.. కానీ అదే జీర్ణించుకోలేకపోతున్నా': కొండా సురేఖ

1 hour ago 1
మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి పోయినందుకు తనకు బాధ లేదని, కానీ ఎలాంటి వివరణ తీసుకోకుండా, కారణం చెప్పకుండా బర్తరఫ్‌ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఉరిశిక్ష పడిన వ్యక్తికి కూడా చివరిసారిగా చెప్పుకునే అవకాశం ఇస్తారని, తనకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇక మంత్రి పదవి పోయినా పార్టీకి రాజీనామా చేసేది లేదని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
Read Entire Article