తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వాల హయాంలో మంత్రులు కేబినెట్ నుంచి బర్తరఫ్‌కు గురికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2015లో తొలి కేసీఆర్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను తొలగించారు. ఆ తర్వాత కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక 2021లో కీలక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను అసైన్డ్ భూముల ఆరోపణల నేపథ్యంలో కేబినెట్ నుంచి తప్పించారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖపై బర్తరఫ్ వేటు పడింది.