తన మూడేళ్ల బిడ్డ కళ్ల ముందే ఓ తల్లి అనుకోని ప్రమాదంలో మృతి చెందింది. దైవ దర్శనం అనంతరం కాసేపట్లో ఇల్లు చేరుతామని అనగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. బొలెరో వాహనం రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. తల్లి ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల చిన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.