నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా ప్రకటించాలని మహాసేన రాజేష్ డిమాండ్ చేసిన తర్వాత చాలా మంది టీడీపీ నేతలు కూడా ఇదే డిమాండ్‌ను లేవనెత్తారు. ఈ డిమాండ్ జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో టీడీపీ, జనసేన సానుభూతి పరుల మధ్య సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ చర్చ నడిచింది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలోనే మహాసేన రాజేష్‌కు సంబంధించి ఓ పోస్టు వైరల్ అవుతోంది.