న్యూ ఇయర్ జోష్ మామూలుగా ఉండదు, కానీ పోలీసులు మాత్రం కఠిన నిబంధనలు పెట్టారు. హోటళ్లు, క్లబ్బులు 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలి. అశ్లీల నృత్యాలు, బాణసంచా నిషేధం. అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే సౌండ్, అది కూడా 45 డెసిబుల్స్ లోపే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు. మహిళల భద్రతకు షీటీమ్స్ రంగంలోకి దిగుతున్నాయి.