హైదరాబాద్ కూకట్‌పల్లిలో దోమల నివారణ కోసం వెలిగించిన మస్కిటో కాయిల్ నుంచి మంటలు వ్యాపించి టెంట్‌హౌస్ షెడ్డుతోపాటు బీఎస్పీ ఇండస్ట్రీస్ టింబర్ డిపో దగ్ధమయ్యాయి. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించగా.. యాదగిరి, రాజు అనే ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నాలుగు ఫైర్ ఇంజిన్లు తెల్లవారుజాము వరకు శ్రమించి మంటలను ఆర్పాయి. స్థల వివాదం నేపథ్యంలో ప్రమాదంపై అనుమానాలున్నాయని డిపో యజమాని సత్యనారాయణ ఆరోపించారు.