నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఒకేరోజు రెండు ప్రమాదాలకు గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వాహనం దెబ్బతినగా.. ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో ఎమ్మెల్యేకు గాయాలు కాలేదు. సిబ్బంది వెంటనే మరో కారులోకి మార్చారు. చిట్యాల మండలంలో కార్యక్రమాలు ముగించుకుని భువనగిరికి వెళ్తున్న సమయంలో మరో ప్రమాదం జరిగింది. రెండు ఘటనల్లోనూ ఆయన క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.