మాజీ సీఎం వైఎస్ జగన్ బంధువు వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సహా రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జగన్ బాబాయి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం వేడుక శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో సీఎం విజయ్, వైఎస్ జగన్, కేటీఆర్‌లు కలిసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక, నటి త్రిష కూడా విజయ్ వెంట రావడం గమనార్హం.