తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద ప్రతి హాస్పిటల్ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం ద్వారా ఫేక్ డాక్టర్లు, అనధికారిక క్లినిక్‌లకు అడ్డుకట్ట వేస్తూ హాస్పిటల్ పూర్తి వివరాలను ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.