Hyderabad No Water Supply: హైదరాబాద్ వాసులకు జల మండలి అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. జనవరి 10, 11 తేదీల్లో.. సుమారు 36 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. కృష్ణా ఫేజ్-2 పైపులైన్‌లో కీలక మరమ్మతులు, లీకేజీల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఆగిపోనుండటంతో, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాల పేర్లు ప్రకటించారు అధికారులు.