Nampally Automated Parking Complex: హైదరాబాద్‌లో వాహనాల రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. నాంపల్లిలో దేశంలోనే మొట్టమొదటి ఆటోమేటిక్ మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించింది. 15 అంతస్తుల ఈ భవనంలో 250 కార్లు, 200 బైకులు పార్క్ చేసుకునే సౌకర్యం ఉంది. రోబోటిక్ సిస్టమ్, AI నిఘా, సోలార్ పవర్ వంటి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ పార్కింగ్ కాంప్లెక్స్ వాహనదారులకు భారీ ఊరటనివ్వనుంది.