Miss England leaves Miss World 2025: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ వైదొలగుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత కారణాలంటూ మొదట వైదొలిగిన ఆమె, ఆ తర్వాత నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉదయం నుండి రాత్రి వరకు మేకప్‌తోనే ఉండాలని, ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలని ఒత్తిడి చేస్తున్నారని, తమను వేశ్యలుగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు ప్రపంచ ఫ్యాషన్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.