హీరోయిన్ నయనతారను అభిమానులు 'లేడీ సూపర్‌స్టార్' అని ఇష్టంగా పిలుచుకుంటారు. సినీ నటిగా కెరీర్ ప్రారంభించి అగ్రనటిగా ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నయనతార వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను నెట్‌ఫ్లిక్స్‌లో 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే పేరుతో ఒక డాక్యుమెటరీ రానుంది.