హైదరాబాద్‌లోని జీడిమెట్ల, షాపూర్ నగర్ ప్రాంతంలో ఉన్న పూర్ణిమ స్కూల్‌లో నర్సరీ చిన్నారిపై అదే స్కూల్ ఆయా అత్యంత కర్కశంగా దాడి చేసింది. స్కూల్ ముగిసిన తర్వాత చిన్నారిని కొట్టడమే కాకుండా.. ఆమెపై కాలు వేసి తొక్కిన ఘటన వీడియోగా రికార్డ్ అయి వైరల్ అయింది. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన చిన్నారి తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఆయాను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను ఆయాలకు అప్పగించే విషయంలో ఈ ఘటన తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన పెంచింది.