నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖలో నకిలీ పత్రాలతో కారుణ్య నియామకం పొందిన వ్యవహారం బయటపడింది. శాలిగౌరారం పీహెచ్‌సీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు గతేడాది పదవీ విరమణ చేయగా.. అదే ఏడాది మరణించారు. అయితే ఆయన మే నెలలోనే విధుల్లో ఉండగా చనిపోయినట్లు నకిలీ ఆధార్ చిరునామా, డెత్ సర్టిఫికెట్ సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పత్రాల ఆధారంగా ఆయన కుమారుడు దామరచర్ల పీహెచ్‌సీలో ఉద్యోగం పొందారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు 14 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.