నల్లగా ఉందని భర్త.. అశుభాలు జరుగుతున్నాయని అత్తామామ.. కొత్త కోడలిని ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో చోటుచేసుకుంది. వినుకొండలోని తిమ్మాయపాలెంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దీంతో న్యాయం చేయాలంటూ బాధితురాలు అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.