కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తనకు ఇచ్చిన ప్రభుత్వ సలహాదారు పదవి ద్వారా వచ్చిన జీతం మొత్తాన్ని.. పేద విద్యార్థుల చదువులకు అందిస్తానని తేల్చి చెప్పారు. 2 ఏళ్ల పాటు నెలకు వచ్చే రూ.1 లక్షను ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశాలు ఇచ్చిందని.. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని వీహెచ్ తెలిపారు.