వృద్ధాప్యంలో భాగస్వామి దూరమై.. ఒంటరిగా జీవించటం.. మాటల్లో వర్ణించలేని నరకం. ఇలాంటి సమస్యతో మనముందరే ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ వయసులో తోడూనీడగా ఉండే వ్యక్తి దూరమై.. బాగోగులు చెప్పుకోలేక, భావాలను పంచుకోలేక వారు పడే ఇబ్బందులు అనేకం. తోడు కావాలని మనసు కోరుతున్నా.. సంఘం ఏమంటుందో అనే భయాలతో వెనకడుగు వేసేవారే ఎక్కువ. కానీ ఓ తాతయ్య చేసిన ప్రయత్నం ఇప్పుడు అలాంటి వారిలో ధైర్యం నింపుతోంది. తన భార్య చనిపోయిందని.. తనకు తోడునీడలా ఉండేందుకు భార్య కావాలంటూ చీరాల వద్ద ఉన్న స్వర్ణ గ్రామానికి చెందిన నీరుకట్ల నారాయణ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.