Akkineni Naga Chaitanya wedding: నాగచైతన్య, శోభితా ధూళిపాళ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం డిసెంబర్ 4న రాత్రి ఘనంగా జరిగింది. వివాహానికి ముందు జరిగే కార్యక్రమాలు కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరిగాయి. అయితే, నాగచైతన్యను పెళ్లికుమారుడిగా ముస్తాబు చేసిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నట్లుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో వాస్తవం ఎంత?