Is Office of Profit Rule Apply To Nagababu?: ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమిస్తూ కేబినెట్ హోదా కల్పించింది. ఆయనకు జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు లాభదాయక పదవుల్లో ఉండకూడదనే నిబంధన ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ మేరకు రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ 191(1)) ఇబ్బందిగా మారే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.