నాగబాబుకు జాక్ పాట్.. బాబు క్యాబినెట్‌లోకి?

1 month ago 4
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నటుడు నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. రాస్ట్రంలో ఖాళీ అయిన మూడు స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఇస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, మూడు సీట్లకు వేరే అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కనున్నట్లు తెలిసింది. నాగబాబును మంత్రివర్గంలోకి చంద్రబాబు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం 25 మందిని క్యాబినెట్‌లోకి తీసుకొవచ్చు. ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బీజేపీ నుంచి ఒకరికి మంత్రిగా అవకాశం దక్కింది. ఇప్పుడు ఏపీ క్యాబినెట్‌లోకి నాగబాబును కూడా తీసుకోనున్నట్లు సమాచారం. మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిని నాగబాబుకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానున్నట్లు సమాచారం.
Read Entire Article