నాన్‌వెజ్ ప్రియులకు నిజంగా ఇది తీపి కబురే. ఎందుకంటే గతంలో పోలిస్తే చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారం వరకు రూ. 230-రూ.250 వరకు పలికిన ధరలు ప్రస్తుతం రూ. 200కు దిగొచ్చాయి. చాలా ప్రాంతాల్లో చికెన్ ధరలు రూ. 200 వరకే ఉన్నాయి. త్వరలో ఆషాడమాసం రానుండగా.. ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.