'మా నాన్న నన్ను ఎవరికైనా అమ్మేస్తానని అంటున్నడు.. నేను ఇంటికి వెళ్లను స్కూళ్లోనే ఉంటా' అంటూ ఆరో తరగతి చదువుతున్న ఓ 11 ఏళ్ల బాలిక స్కూళ్లో దాక్కుంది. తల్లి ఎటో వెళ్లిపోగా.. ఒంటరిగా ఉంటున్న తండ్రి తనను గతకొన్ని రోజులుగా వేధిస్తున్నాడని.. తీవ్రంగా కొట్టడంతో పాటుగా ఎవరికైనా అమ్మేస్తానని అంటున్నాడని టీచర్లు, తోటీ స్నేహితుల ముందు వాపోయింది. ఈ హృదయ విదారకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో చోటు చేసుకుంది.