వైవిధ్యమైన కథాంశాలతో, తనదైన వినోదపూరిత నటనతో ప్రేక్షకులను అలరించే సంపూర్ణేష్ బాబు మరోసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి అన్నదమ్ముల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించేలా రూపొందించిన ‘సోదరా’ అనే సినిమా ద్వారా కుటుంబ సంబంధాల మాధుర్యాన్ని మళ్లీ తెరపై చూడబోతున్నారు.