నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబం మెుత్తం ఆత్మహత్యకు పాల్పడింది. దంపతులతో పాటు వారి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‍లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన కుమారుడు రూ. 30 లక్షల వరకు అప్పులు చేయటంతో వారు సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.