ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ దేశాల్లో మరణించిన 66 మంది కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ.3.30 కోట్ల ఎక్స్ గ్రేషియా మంజూరు చేశారు. ఈ నిధులను తమ బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగిందని బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి తెలిపారు. ఇప్పటివరకు 103 కుటుంబాలకు రూ.5.15 కోట్లు చెల్లించగా, మొత్తం 169 కుటుంబాలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.8.45 కోట్లు అందజేశారు.