పదో తరగతి పరీక్షల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేస్తూ గురువారం (నవంబర్ 28న) తీసుకున్న నిర్ణయాన్ని.. సర్కార్ ఉన్నట్టుండి వెనక్కి తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ఈ ఏడాదికి నిలిపేస్తూ.. వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.