నిప్పుల కొలిమిలా తెలంగాణ.. 46.3 డిగ్రీలతో ఠారెత్తించిన ఎండలు, వడదెబ్బకు 9 మంది బలి

3 months ago 19
తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత పీక్ స్టేజ్‌కు చేరింది. పది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా.. వడదెబ్బ కారణంగా శుక్రవారం ఒక్కరోజే వివిధ జిల్లాల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో అత్యధికంగా 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఈ వడగాలుల తీవ్రత కొనసాగుతుందని.. అయితే ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 1వ తేదీ తర్వాతే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది.
Read Entire Article