నిప్పుల కొలిమిలా తెలంగాణ.. 8 జిల్లాల్లో రికార్డు స్థాయి ఎండలు, నిర్మల్‌లో 46 డిగ్రీలు

4 months ago 21
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చాయి. మంగళవారం నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై పదేళ్ల రికార్డును బద్దలుకొట్టింది. రాష్ట్రంలోని 39 మండలాల్లో వడగాలులు వీయగా.. వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బకు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రానున్న మూడు రోజులు కూడా ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
Read Entire Article