మెహిదీపట్నం జంక్షన్ వద్ద పాదచారుల కష్టాలు తీర్చేందుకు హెచ్‌ఎండీఏ నిర్మిస్తున్న స్కైవాక్ జూన్ నాటికి పూర్తి కానుంది. రక్షణ శాఖ అనుమతి ఆలస్యం కావడంతో పనులు ఆలస్యమైనప్పటికీ.. ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. 3,380 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.32.97 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్కైవాక్‌లో 5 ప్రవేశ/నిష్క్రమణ మార్గాలు, 2 టన్నెల్ మార్గాలు ఉంటాయి. రైతుబజార్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు పాదచారులకు సురక్షితమైన మార్గం లభిస్తుంది. వాణిజ్య ప్రాంతంలో షాపులు ఏర్పాటు చేసి ఆదాయం పొందనున్నారు.