తెలంగాణలో ఆర్థిక, గణాంకశాఖలో కొత్తగా ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత పోస్టులను రద్దు చేసి.. కొత్తగా 166 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త పోస్టుల్లో గణాంక అధికారులు, సహాయ సంచాలకులు, ఉప గణాంక అధికారులు, పర్యవేక్షకులు, జూనియర్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. రద్దు చేసిన పోస్టుల్లో సహాయ గణాంక అధికారి, టైపిస్టు, స్టెనో, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఈ మార్పులతో ఆర్థిక, గణాంకశాఖలో మొత్తం పోస్టుల సంఖ్య 277 నుంచి 405కు పెరిగింది.